రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రముఖ కన్నడ బ్యూటీ శ్రీ లీలా ఇద్దరు కలిసి నటించిన సినిమా  పెళ్లిసందD .ఈ సినిమాతో శ్రీలీల ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఇదిలా వుండగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపున సొంతం చేసుకున్న శ్రీ లీల ఎంట్రీ తోనే దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. ఈ క్రమంలోని ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోందని చెప్పవచ్చు.  ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే  ప్రస్తుతం శ్రీ లీల చేతిలో ఆరు ప్రాజెక్టులకు పైగా ఉన్నట్లు సమాచారం.. 

అలాంటి ప్రాజెక్ట్స్ లో #PVT 04 కూడా ఒకటి.అయితే మెగా మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఎంట్రీ ఇస్తున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై త్రివిక్రమ్ భార్య సౌజన్యతో కలిసి నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇక  ఈ సినిమా కోసం శ్రీలీలా వసతి ఖర్చులు బాగా ఎక్కువ అవుతున్నాయి అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.. అంతేకాదు  ఇక ఈమె ఒక్కరోజు ఖర్చు చూసి నిర్మాతలు సైతం బెంబేలెత్తుతున్నారు.అయితే  మూడు వారాలపాటు వైష్ణవ తేజ్ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉండగా దీనికోసం శ్రీ లీల ఆమె తల్లితో కలిసి నెల రోజుల పాటు హైదరాబాదులోనే ఉంటోందట.

ఇందులో భాగంగానే వీరికి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో సూట్ రూమ్ బుక్ చేశారట.  దీనికి రోజుకు దాదాపు రూ. 20 వేలకు పైగానే పే చేస్తున్నారట నిర్మాతలు.  హీరోయిన్ ఒక్క షెడ్యూల్ కి హాజరైతే వసతి కోసం అంత మొత్తంలో ఖర్చు అవుతుందనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు బడ్జెట్ ఎలా కంట్రోల్ చేయాలి అనే ప్రశ్నలు కూడా నిర్మాతల మదిలో మెదులుతున్నట్లు సమాచారం.ఇక  ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇలా సూట్ గది గురించి బాగా చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో ఈమెకు కోటి రూపాయల వరకు పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: