కొంతమంది దర్శకులు ప్లాప్ సినిమాలను రూపొందించినా కూడా వారి చిత్రాలను ఎంతో ఇష్టంగా చూస్తూ ఉంటారు అభిమానులు. ప్రేక్షకులు సైతం వారి సినిమాలు ఫ్లాప్ అని తెలిసినా కూడా వారి సినిమాలను ఏ విధంగా రూపొందించారో అన్న అసక్తితో చూస్తారు. ఆ విధంగా తమిళ దర్శకుడు అయిన ఓ దర్శకుడు తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రేమ కథ చిత్రాల దర్శకుడైన గౌతమ్ మీనన్ ఇప్పుడు తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేస్తూ ఉండడం అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది.

తమిళంలో భారీ చిత్రాలను రూపొందించి మంచి సక్సెస్ ను అందుకున్న ఈ దర్శకుడు ఎక్కువగా ప్రేమ కథా సినిమా లను చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ప్రస్తుతం శింబు హీరోగా చేసిన ఓ సినిమాను విడుదల చేసిన ఈ దర్శకుడు ఆ తరువాత సినిమాను తెలుగులో చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. రామ్ హీరోగా ఆయన తెలుగులో ఒక సినిమా చేయాలని భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. 

చాలా రోజులుగా ఈ దర్శకుడు తెలుగులో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి కానీ అవి కార్యరూపం దాల్చకపోవడం తో ఆయన అభిమానులు ఎంతగానో నిరాశ పడ్డారు. ఇప్పుడు రామ్ తో కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్నాడు అనే వార్తలు రావడం నిజంగా మంచి విషయమే అయి నా ఇదే నిజమని అన్న అనుమానాలను వారు వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం రామ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యం లో ఈ తర్వాత సినిమా తర్వాత గౌతమ్ మీనన్ చేతులు కలపబోతున్నాడని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడవలసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: