మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.  మోహన్ రాజా దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా తెరక్కుతు ఉండగా ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అనుకోవాలని భావిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడంతో ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని మెగా అభిమానులు కూడా ఎంతగానో కోరుకుంటున్నారు.

అయితే ఈ చిత్రానికి ఏమాత్రం బజ్ లేకపోవడం ఒక్కసారిగా మెగా అభిమానులను కలవరపరుస్తుంది అని చెప్పాలి. కారణం ఏదైనా కూడా మొదటి నుంచి కూడా ఈ సినిమాకు పెద్దగా బజ్ క్రియేట్ అవడం లేదు. దాంతో ఈ సినిమా కి మంచి ఓపెనింగ్స్ అయినా రాబట్టుకుంటుందా అన్న అనుమానాలను వ్యక్త పరుస్తున్నారు కొంతమంది సినిమా విశ్లేషకులు. నయనతార , సత్య దేవ్ నటిస్తూ ఉండగా సల్మాన్ ఖాన్సినిమా లో ముఖ్య అతిధి గా చేసినా కూడా ఈ సినిమాకు ఏ మాత్రం బజ్ రావడం లేదు. 

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను విడుదల చేయగా అది ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడం ఈ విధమైన పుకార్లు రావడానికి కారణం అవుతుంది. మరి విడుదల తేదీ దగ్గర పడుతున్న కూడా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఏమాత్రం ఇవ్వకపోవడం నిజంగా ఈ సినిమా దసరాకు విడుదల అవుతుందా అన్న అనుమానాలను కలిగిస్తుంది అంటే తప్పకుండా భారీ స్థాయిలో ఉండాలి. దానికి చిత్ర బంధం ఏ విధమైన ప్రణాళిక రూపొందిస్తుందో చూడాలి. ఈ సినిమా కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా నిరాశపరచడంతో దాని తాలూకు ప్రభావం ఇంకా ఆయనపై కొనసాగుతుందని దీన్ని బట్టి చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: