విజయ్ దేవరకొండ హీరోగా ఎలాంటి క్రేజ్ కలిగి ఉన్నాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఆయనలో చాలామందికి తెలియని కోణం మరొకటి ఉంది. సమాజం పట్ల ఆయన చూపించే బాధ్యత ప్రేమ దాదాపు చాలా తక్కువ మంది హీరోలు ప్రదర్శిస్తారని చెప్పాలి. హీరో అయినప్పటి నుంచి ఆయన సమాజ సేవ చేస్తూనే వస్తున్నారు. ఎప్పుడు కూడా సినిమా వరకు మాత్రమే తన పని తాను చూసుకొని ముందుకు వెళ్లలేదు. మొదటి నుంచి తనను నమ్మిన వారి కోసం అభిమానుల కోసం ప్రేక్షకుల కోసం ఏదో ఒకటి చేసే విధంగా అడుగులు వేశారు.

 ఒక డాన్స్ షోకి గెస్ట్ గా వెళ్లి అక్కడ ఒక డ్యాన్సర్ కథ విని చెల్లించిపోయి ఆయనకు బట్టలు లేవని తెలుసుకుని సొంత బ్రాండ్ రౌడీ వేర్ నుంచి బట్ట లు ఇస్తానని చెప్పాడు. అయితే చాలా మంది మాటలు చెప్పడం వరకే ఆది నెరవేర్చడం వరకే ఈ విధంగా మాటలను చెబుతూ ఉంటారు కానీ విజయ్ దేవరకొండ అలా కాదు టీం నుంచి సదరు డాన్సర్ కు బట్టలు పంపించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడట. నిజంగా ఇది మంచి విషయం అనే చెప్పాలి.

 ఇకపోతే విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా అందరిని నిరాశ పరచగా ఇప్పుడు తన తదుపరి సి నిమా ఖుషి తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. డిసెంబర్లో ఈ సినిమా యొక్క విడుదల ను చేయడానికి రంగం సిద్ధం చేసిన చిత్ర బృందం త్వరలోనే దానిని అధికారికంగా ప్రకటించనున్నారు సమంత కథనాయకగా నటిస్తున్న ఈ సినిమా యొక్క విడుదల త్వరలోనే మొదలు కాబోతుంది. తెలుగులో ప్రేమ కథ సినిమాల లో ఎం తో బాగా రూపొందించే దర్శకుడైన శివనిర్వాన ఈ చిత్రానికి దర్శకత్వం అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: