టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో అడుగుపెట్టి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సొట్ట బుగ్గల సుందరికి ఫిదా అవ్వని వారు ఎవరు ఉండరు..

మంచి అందం, అభినయంతో ప్రతి పాత్రలోనూ స్వచ్ఛమైన ముఖ కవళికలతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. వాటిలో బంగార్రాజు , శ్యామ్ సింగరాయ్ సినిమాలు రెండూ కూడా విజయాన్ని సొంతం చేసుకుని.. ఇక ఈ మూడు సినిమాలు ఈమెను స్టార్ హీరోయిన్ రేంజ్ లో నిలబెట్టాయి. కానీ ఈమె ఎంచుకున్న కథల ఎంపికలు తేడా కొట్టడంతో ఈమె నటించిన 2 సినిమాలు కూడా డిజాస్టర్ అవడంతో ఇక ఈమె పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఎట్టకేలకు సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మళ్ళీ ఈ సినిమాతో తన పూర్వ వైభవాన్ని అందుకుందని చెప్పవచ్చు.

 

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కృతి శెట్టి ఒక యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతోందట. ఇక అతడు ఎవరు అనే విషయం పక్కన పెడితే ఆమె కాస్త సమయం దొరికితే చాలు వెంటనే అతడితో చట్టపట్టాలేసుకొని తిరుగుతూ ఉంటుందనే వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ తాజాగా కృతి శెట్టి గురించి ఇలాంటి ఒక రూమర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదివరకే ఒక కోలీవుడ్ స్టార్ హీరో వారసుడు కృతి శెట్టి కి ఆఫర్ ఇచ్చినప్పుడు ఆమె ముఖం మీదే నో చెప్పి వచ్చేసిందట.

కానీ తాజాగేమో ఒక హీరోతో ప్రేమాయణం నడుపుతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో అయితే ప్రస్తుతం ఈమెకు అవకాశం వరించలేదు. కానీ తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం సూర్య సరసన ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తరువాత ఆ తర్వాత విశాల్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఈ సినిమాలు ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో తెలియాల్సి ఉంది .ఒకవేళ అక్కడ కూడా విజయం సాధిస్తే ఇక కృతి శెట్టి కి తిరుగు ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: