మంచు మోహన్ బాబు గారాల పట్టిక మంచు లక్ష్మి  గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఈమె మంచు వారి కూతురిగా  మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఈమె తండ్రి ఇమేజ్ ను ఒక రకంగా ఉపయోగించుకున్నప్పటికీ.. సొంతంగా తన ప్రతిభను కనబరిచి మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈమె పూర్తి పేరు మంచు లక్ష్మీ ప్రసన్న.. టెలివిజన్ వ్యాఖ్యాత కూడా.. తెలుగు, అమెరికన్ టెలివిజన్లో పనిచేసిన మంచు లక్ష్మి తన భాష కూడా ఆమెకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. అయితే 2006లో చెన్నైకి చెందిన ఐటీ ప్రొఫెషనల్ ఆండీ శ్రీనివాసన్ ను వివాహం చేసుకున్నారు .

ఇదిలావుంటే ఇక ప్రస్తుతం ఈ దంపతులకు సరోగసి ద్వారా ఒక కుమార్తెకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే  మంచు లక్ష్మి సినిమాలలో విలన్ గా కూడా నటించి మరింత ఇమేజ్ ను సొంతం చేసుకుంది.అయితే మొదటిసారి సిద్దార్థ్ హీరోగా వచ్చిన అనగనగా ఒక ధీరుడు సినిమాలో విలన్ గా అడుగు పెట్టింది. ఇక ఆ తర్వాత బుడుగు , లక్ష్మీ బాంబు , గుండెల్లో గోదారి వంటి చిత్రాలలో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈమె కుటుంబ సభ్యులతో కలసి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు సహాయ యజమానిగా చలామణి అవుతుంది.అయితే  ఇక ఇది 56 నిర్మాణ సంస్థలను నిర్మించింది. ఇక అమెరికాలో చిన్న చిన్న టెలివిజన్ పాత్రలలో కూడా నటించి మెప్పించింది.

 2006లో లాస్ ఏంజిల్స్ లోని లా ఫెమ్మీ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా విల్ షైర్ ఆర్ట్స్ థియేటర్ లో ప్రదర్శించబడిన పర్ఫెక్ట్ లైవ్ అనే షార్ట్ ఫిలిం కి దర్శకత్వం కూడా వహించి నిర్మించి నటించింది.ఇకపోతే 2016లో తాహెర్ అలీ బేగ్ దర్శకత్వం వహించిన రోల్డ్ డాల్ యొక్క మటిల్డా యొక్క అనుసరణలో మిస్ ట్రంచ్పుల్ గా థియేటర్లోకి ప్రవేశించింది.కాగా  ఈమె చిన్నప్పటినుంచి సినిమాలలో నటించిన విషయం చాలామందికి తెలియదు .తన తండ్రి నటించి, నిర్మాతగా వ్యవహరించిన పద్మ వ్యూహం సినిమాలో గుడిలో ఒక చిన్న పాప పాత్రలో నటించింది. ఒక పాటలో కూడా కనిపించి..తన అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.ఇక  చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది మంచు లక్ష్మి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: