సినిమా పరిశ్రమలో పెద్ద దిక్కు లేకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది అని ఇప్పుడు కొంతమంది యువ హీరోల కెరియర్ను చూస్తే అర్థమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలకు పెద్దదిక్కు అనేవారు ఎవరు ఉండరు. అదే బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు పెద్దదిక్కుగా చాలామంది ఉంటారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు ఇచ్చే సల హాలను తీసుకుంటూ తమ కెరియర్ను బిల్డ్ చేసుకుంటూ అగ్ర హీరోలుగా ఎదుగుతూ ఉంటారు వారసత్వపు హీరోలు.

ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలోకి మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న హీరో వైష్ణవ్ తాజాగా తన తదుపరి సినిమాతో మరొక ప్లాపును అందుకున్నాడు. ఆయన రెండో సినిమా కొండ పొలం భారీ డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే.  ఆ సినిమా తరువాత ఎన్నో అంచనాలు పెట్టుకొని చేసిన రంగ రంగ వైభవంగా సినిమా కూడా భారీ స్థాయిలో ప్లాప్ అవడం నిజంగా ఒక్కసారిగా వైష్ణవ తేదీన ఎంతో బాధపడేలా చేసింది.

ఈ సినిమాలో ఏం తగ్గిందో తెలియట్లేదు అనేంతగా ఆయన తన సన్నిహితుల వద్ద బోరు మంటున్నాడట. దాంతో ఇప్పుడు తప్పకుండా తాను విజ యం అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వైష్ణవ తేజ్ నటుడిగా ఎంతటి సత్తా కలిగినవాడు. ఉప్పెన సినిమాతో తేలిపోయింది. కొండ పొలం సినిమాలో కూడా ఆయన నటన అందరికీ నచ్చింది. ఈ నేపథ్యంలో వైష్ణవ తేజ్ ఒక భారీ విజయం అందుకోవాల్సిన ఈ సమయంలో ఇటువంటి ప్లాపులను అందుకోవడం నిజంగా ఆయన కెరియర్ కు ప్రమాదకరమనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం అందిస్తున్నాడు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ సినిమా అయినా ఆయ నకు విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: