గతంలో అంటే ఈ ఓటీటీలు రాక మునుపు కొత్త సినిమాల థియేట్రికల్ రిలీజ్ కోసం మాత్రమే ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ తర్వాత శాటిలైట్, డివిడి, యూట్యూబ్ వంటి వాటిల్లో బాగా ఆలస్యం ఉండేది కాబట్టి వాటి తాలూకు ఎగ్జైట్మెంట్ నెలల తరబడి కొనసాగేది.కానీ ఇప్పుడలా కాదు. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా సరే మహా అయితే నెల రోజులు లేదా అదనంగా మరో వారం. అంతకన్నా లేట్ చేస్తే జనాల్లో ఆసక్తి తగ్గిపోయి ఇంత లేటా అంటూ చూడటం కూడా ఆలస్యం చేస్తున్నారు. అందుకే ఇప్పుడున్న సిట్యుయేషన్ లో జనాలకు బాగా రీచ్ కావాలంటే ఓటీటిలో త్వరగా రిలీజ్ చెయ్యాలి. లేదంటే జనాలు మరిచిపోతారు.అందుకే సీతారామం 35 రోజులకే ప్రైమ్ లో వచ్చేసింది. మిలియన్ల వ్యూస్ తో ఆ ప్లాట్ ఫార్మ్ మీద టాప్ 1 ట్రెండింగ్ లో ఉంది. హిందీ వెర్షన్ విడుదలైన వారానికే దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ చేసేయడంతో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు ఓటిటి ఫ్యాన్స్ చూపు బింబిసార, కార్తికేయ 2 మీద ఉంది. ఈ రెండు హక్కులు జీ5 సాంతం చేసుకుంది.


ప్రీమియర్ల విషయంలో కొంత నెమ్మదిగా ఉండే ఈ సంస్థ వీటిని కూడా ఆలస్యం చేస్తూ వస్తోంది. నిఖిల్ మూవీ బాలీవుడ్ లో మొదటి రెండు మూడు వారాలు దూసుకుపోయినప్పటికీ బ్రహ్మాస్త్ర వచ్చాక ఆ సినిమా కొంచెం ఫర్వాలేదు అనిపించున్నాక ఈ సినిమా ఇక నెమ్మదించక తప్పలేదు.ఇక కళ్యాణ్ రామ్ సినిమా ఎప్పుడో స్లో అయ్యింది. ప్రధాన కేంద్రాల్లో మాత్రమే రన్ కొనసాగుతోంది. బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చేశాయి కనక ఇక ఆశించడానికి ఏమి లేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం బింబిసారని సెప్టెంబర్ 23 డిజిటల్ డేట్ లాక్ చేసే ఆలోచనలో సదరు టీమ్ ఉన్నట్టు సమాచారం. కార్తికేయ 2ని వారం గ్యాప్ తో అదే నెల 30, ఒకవేళ అది సాధ్యం కాకపోతే దసరా కానుకగా అక్టోబర్ 5 లేదా 7న వదిలే ప్లానింగ్ జరుగుతోందట. వీటిలో ఏ డేట్ కన్ఫర్మ్ అయినా చాలా దగ్గరలో ఉన్నట్టే. థియేటర్లలోనే అంత భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న బింబిసార, కార్తికేయ 2లు ఓటిటిలో చేయబోయే రచ్చ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: