ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమ నటించిన మొదటి మూవీ తోనే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలు లభిస్తూ ఉంటాయి. అలాంటి వారిలో కృతి శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తో కృతి శెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దానితో ఈ ముద్దుగుమ్మకు వరస సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఉప్పెన మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని వరసగా మూడు విజయాలను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది  ఇది ఇలా ఉంటే వరుసగా మూడు విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన కృతి శెట్టి ప్రస్తుతం మాత్రం విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయింది. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ది వారియన్ మూవీలో హీరోయిన్ గా నటించింది.

మూవీ మంచి అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే ఈ ముద్దుగుమ్మ నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నిన్న అనగా సెప్టెంబర్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.ఈ మూవీ కి కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షోకే నెగిటివ్ టాక్ లభించింది. దానితో ఈ ముద్దుగుమ్మకు వరుసగా మూడు అపజయాలు దక్కినట్లే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: