సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక డైరెక్టర్ లేదా హీరో హీరోయిన్స్ హిట్ సినిమా చేస్తేనే వారికి తమ తరువాత సినిమా అవకాశాలు వస్తాయి. ఇక వారు నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటే వారికి అవకాశాలు రావడం కూడా కష్టతరంగా మారుతుంటాయి.హీరో హీరోయిన్లు ఎలాగైనా అవకాశాలు అందుకుంటారు కానీ డైరెక్టర్ల పరిస్థితి అలా కాదు.ప్రస్తుతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు సీనియర్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ.ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు కృతి శెట్టి నటించిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విజయం పై విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఆధారపడి ఉంది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ సినిమా ఆగిపోయినట్లేనని పలువురు భావిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దిల్ రాజు ఎప్పటినుంచో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ క్రమంలోనే దర్శకులకు మంచి కథ రెడీ చేయమని చెప్పారట.


ఇకపోతే దిల్ రాజు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్లో విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని భావించారు అయితే ఈ సినిమా చేయాలంటే ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా హిట్ అయితేనే ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందని వెల్లడించారట.ఇంద్రగంటి సినిమా అంటే మాక్సిమం హిట్ సినిమాలేనని అందరూ భావిస్తారు. అయితే ఈయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ తిరిగి ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేయడానికి నో అంటున్నాడట.ఇప్పటికే లైగర్ సినిమాతో కోలుకోలేని దెబ్బతిన్న విజయ్ దేవరకొండ వెంటనే ఒక హిట్ సినిమాలో నటిస్తేనే ఈయన క్రేజ్ అలాగే కొనసాగుతుంది అయితే ఇలాంటి పరిస్థితులలో ఫ్లాప్ డైరెక్టర్ తో తిరిగి సినిమా చేయటానికి విజయ్ దేవరకొండ సాహసం చేయలేకపోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: