టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న మంచు విష్ణు తాజాగా జిన్నా అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించగా ,  పాయల్ రాజపుత్ ,  సన్ని లియోన్ ఈ మూవీ లో మంచు విష్ణు సరసన హీరోయిన్ లుగా నటించారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి పాయల్ రాజపుత్ మరియు సన్ని లియోన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను కూడా విడుదల చేయగా వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా జిన్నా మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది.

తాజాగా జిన్నా మూవీ యూనిట్ ఈ సినిమా నుండి 'గోలి సోడా' అనే లిరికల్ వీడియో సాంగ్ ని సెప్టెంబర్ 19 వ తేదీన ఉదయం 11 గంటల 12 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టు కుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ తో మంచి విష్ణు ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: