తన అందం అభినయంతో తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది సొట్ట బుగ్గల సుందరి కృతి శెట్టి. ఉప్పెన అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా సార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాలతో దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ఈ అమ్మడు చేసిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ అవకాశాలు మాత్రం వరుసగా తలుపు తడుతూనే ఉన్నాయి.


 ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బంగార్రాజు శ్యామ్ సింగర్ సినిమాలతో మరో రెండు విజయాలను కూడా సొంతం చేసుకుంది అనే చెప్పాలి. ఇక ఆ తర్వాత మాత్రం కథల ఎంపికలో కాస్త తప్పటడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాలతో ఫ్లాట్ చవిచూసింది కృతి శెట్టి. ఇకపోతే ఈ అమ్మడు ప్రేమాయణం గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.  కృతి శెట్టి ప్రస్తుతం ఒక యంగ్ హీరో తో ప్రేమాయణం నడుపుతుందట. కాస్త సమయం దొరికిందంటే చాలు అతడితో చెట్టా పట్టా లేసుకొని తిరుగుతూ ఉందనే వార్తలు గుప్పుమన్నాయి.



 ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఇటీవలే కృతి శెట్టి గురించి ఇలాంటి ఒక రూమ్ లో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. ఇదివరకే ఒక కోలీవుడ్ స్టార్ హీరో వారసుడు కృతి శెట్టి కి ఆఫర్ ఇచ్చినప్పుడు ఆమె ముఖం మీద నో చెప్పిందట. కానీ ఇప్పుడు మాత్రం  ఒక యువ హీరోతో ఎంతో డీప్ లవ్ లో మునిగి తేలుతుంది అనే వార్త మాత్రం వైరల్గా  మారిపోయింది. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటుంది ఈ సొట్ట బుగ్గల సుందరి.

మరింత సమాచారం తెలుసుకోండి: