హైపర్ ఆది గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు . ఏకంగా జబర్దస్త్ లో తనదైన శైలిలో కామెడీ పంచుతు  సరికొత్త ట్రెండ్ ను సృష్టించాడు హైపర్ ఆది.  టీం లీడర్ గా మారిన తర్వాత జబర్దస్త్ లో మునుపెన్నడూ చూడని కామెడీ ఎంటర్ టైన్ మెంట్ ని ప్రేక్షకులు ఆస్వాదించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ఎందుకో జబర్దస్త్ నుంచి మాత్రం తప్పుకున్నాడు. అలా అని ఈటీవీ వాళ్ళతో సంబంధాలను తెంచుకోలేదు.


 జబర్దస్త్ నుంచి తప్పుకున్నప్పటికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ లాంటి షో లలో కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే తనకు వర్క్ లోడ్ ఎక్కువ అవ్వటం కారణంగానే జబర్దస్త్ నుంచి హైపర్ ఆది తప్పుకున్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో అతను మళ్ళీ జబర్దస్త్ లో కి రీ ఎంట్రీ ఇస్తే చూడాలని ఎంతో మంది అభిమానులు ఆశపడ్డారు. అందరూ అనుకున్నట్లు గానే హైపర్ ఆది మళ్ళీ జబర్దస్త్ లోకి వచ్చేసాడు. ఇటీవలే గ్రాండ్ గా రి ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. కాగా ఒక్కో టీం కి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల సమయం ఇస్తారు. కానీ హైపర్ ఆది స్కిట్ ప్రేక్షకులు చూస్తారు అనే ఉద్దేశంతో 13, 14 నిమిషాల సమయం ఇచ్చారట.


 హైపర్ ఆది రావడంతో జబర్దస్త్ లో మళ్లీ హడావిడి మొదలైంది. కొంతమంది యూట్యూబ్ లో ఎపిసోడ్ చూసేవాళ్లు సైతం ఇక ఈ టీవీలో ఎపిసోడ్ చూసేందుకు సిద్ధమైపోయారు. అయితే ఇటీవలే  కాలంలో జబర్దస్త్ రేటింగ్స్ ఒక్కసారిగా పడిపోయాయ్ అంటూ  టాక్ ఎప్పుడు వినిపిస్తుంది. అయితే హైపర్ ఆది రాకతో మళ్లీ పుంజుకున్నట్లు  అభిమానులు అనుకుంటున్నారు. ఇక ఇటీవల ఎపిసోడ్లో సోషల్ మీడియా లో సందడి చేసిన బంగారం అమ్మాయినీ తీసుకువచ్చి చంటి కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. అయితే అనధికార సమాచారం ప్రకారం హైపర్ ఆది వచ్చిన తర్వాత  12 నుంచి 15 రేటింగ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనా ఇక ఈ టీవీ వాళ్లు మళ్లీ రేటింగ్ లో హైప్ తీసుకొచ్చేందుకు హైపర్ ఆది ని తీసుకు వచ్చారు అంటూ ప్రచారం మాత్రం జరుగుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: