పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ సొంతం చేసుకుంది.


ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ఈ సినిమాకి మాత్రం ఊహించని స్థాయిలో ఆదరణ లభించలేదని చెప్పాలి. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇలా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు.


ఈ క్రమంలోని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడడంతో డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున భారీ ధరలకు ఈ సినిమాని కొనుగోలు చేశారు.ఇలా భారీ ధరలకు కొనుగోలు చేసినప్పటికీ ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ స్థాయిలో నష్టపోయారు.ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు పూరి జగన్నాథ్ పై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తూ తాము చెల్లించిన డబ్బును వెనక్కి తిరిగి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై పూరి జగన్నాథ్ ఓ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.


 లైగర్ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఈయన కొంత మొత్తంలో డబ్బును ఈయనకి తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆంధ్రకు ఆరు కోట్లు, నైజాం 4.5 కోట్ల రూపాయలు, సీడెడ్ 2.25 కోట్ల రూపాయలను వెనక్కి తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నార ట.మరి ఈ విషయం గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా భారీ నష్టాల ను ఎదుర్కోవడంతో ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సందిగ్ధంలో పడిందట. మరి పూరి తరువాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడోచూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: