‘అల వైకుంఠ పురములో’ సూపర్ సక్సస్ తరువాత త్రివిక్రమ్ తీస్తున్న మూవీ ఎట్టకేలకు ప్రారంభం అయింది. ఈమూవీ వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదల అయ్యే టార్గెట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈనేపధ్యంలో ఈమూవీ మొదటి షెడ్యూల్ కూడ పూర్తి కాకుండానే ఈమూవీకి వస్తున్న ఆఫర్స్ ఫిగర్స్ విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.  


ఈసంవత్సరం సమ్మర్ రేస్ కు వచ్చిన ‘సర్కారు వారి పాట’ మూవీ బయ్యర్లకు చెప్పుకోతగ్గ లాభాలు లేక కేవలం బ్రేక్ ఈవెన్ మాత్రమే అయింది అన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మహేష్ త్రివిక్రమ్మూవీ ఫస్ట్ లుక్ కూడ బయటకు రాకుండానే ఈమూవీ ఓవర్సీస్ రైట్స్ విపరీతమైన పోటీ ఏర్పడి 23 కోట్ల ఆఫరింగ్ వచ్చింది అంటూ ప్రచారం జరుగుతోంది.


ఇది చాలదు అన్నట్లుగా ఈమూవీ ఓటీటీ రైట్స్ కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ 100 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంటూ మరొక ప్రచారం మొదలైంది. ఇక ఈమూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 30 కోట్లు పలుకుతోంది అంటూ మరొక వార్త హడావిడి చేస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈసినిమా రైట్స్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడిందని కేవలం నైజాం ప్రాంతానికి ఈమూవీ రైట్స్ 45 కోట్లు పలుకుతోందని మరొక ప్రచారం. ఆంధ్రా ప్రాంతంలోని వివిధ జిల్లాలలకు సంబంధించి కూడ ఈమూవీకి భారీ ఆఫర్స్ వస్తున్నాయని ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఈమూవీ బిజినెస్ దాదాపు 250 కోట్లు దాటిపోయే ఆస్కారం ఉంది అంటూ లీకులు వస్తున్నాయి.


వాస్తవానికి మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆమూవీకి ఈ స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ రావడం పరిశీలించిన వారు మాత్రం వేరే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈమూవీ పై క్రేజ్ ఉన్నప్పటికీ ఈమూవీ 300 కోట్లు కలెక్ట్ చేయగల స్టామినా ఉందా అంటూ మరికొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు..





మరింత సమాచారం తెలుసుకోండి: