తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు వెంకట్. 1978లో విజయవాడలో జన్మించిన ఈయన మొత్తం విజయవాడలోనే చదువు పూర్తిచేసుకున్నాడు. ఇక చిన్నతనం నుంచీ సినిమాలంటే ఎంతో ఆసక్తి అటు వైపు అడుగులు వేసాడు. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అక్కినేని నాగార్జున ఇక వెంకట్ కి మొదటి సినిమా అవకాశం ఇప్పించారు అని చెప్పాలి.

సినిమా మంచి విజయం సాధించడంతో ఇక మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో సినిమాలో తమ్ముడు పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే ఇక అన్నయ్య వెంకట్ తో పాటు కలిసి నటించిన రవితేజ బాగా హిట్టయ్యాడు. ఇప్పటికి హీరోగా నిలదొక్కుకునీ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు. కానీ వెంకట్  మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. తర్వాత కాలంలో సినిమాలకు దూరం అయ్యాడు. వెంకట్ ఎందుకు సినిమాలకు దూరమయ్యాడు అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.


 ఇండస్ట్రీలో  రాణించాలంటే బ్యాక్ గ్రౌండ్ ముఖ్యం కాదని.. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా ఎంతో మందికి అవకాశాలు రావడంలేదని... ఎంచుకున్న సినిమా కథలు ముఖ్యం అంటూ వెంకట్ చెప్పుకొచ్చాడు. వరుసగా రెండు ఫ్లాపులు వస్తే కచ్చితంగా అవకాశాలు తగ్గిపోతాయి. నా విషయంలో కూడా అదే జరిగింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సొంత ప్రొడక్షన్ ఉండాలి. లేదంటే ప్రొడక్షన్ లో ఉన్న వాళ్లు మనకు సపోర్ట్ గా అయినా ఉండాలి. అప్పుడు నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్  లేకుండా రవితేజ,నాని, విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు రాణిస్తున్నారు. అందుకే బ్యాక్గ్రౌండ్ కాదు కథ ఎంపిక అనేది ఎంతో ముఖ్యం. కథ బాగా సూట్ అయితే బ్లాక్బస్టర్ హిట్ కొట్టవచ్చు.  ప్రస్తుతం బిజినెస్ రంగంలో ఉన్నట్లు వెంకట్ చెప్పుకొచ్చాడు. మంచి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: