టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత కూడా ఒకరిని చెప్పవచ్చు. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఎక్కువగా సినిమాల మీద తన ఫోకస్ ని పెట్టింది. దీంతో తన దగ్గరకు వచ్చిన ఏ సినిమాను కూడా వదిలిపెట్టకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పటికీ కూడా నెంబర్ వన్ స్థానంలోనే సమంత కొనసాగుతూ ఉండడం గమనార్హం. సమంత ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో శాకుంతలం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కించడం జరిగింది డైరెక్టర్ గుణశేఖర్.


ఇక ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లను ప్రకటిస్తూనే ఉంది చిత్ర బృందం. ఇప్పటికే సమంతకు సంబంధించి పలు పోస్టర్లు , వీడియోలను సైతం విడుదల చేసి ఈ సినిమాకు మంచి హైప్ తీసుకోవచ్చారు. అయితే తాజాగా ఇప్పుడు దుష్యంతుడిగా మలయాళం యువ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నట్లుగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు.  ఈ చిత్రం ద్వారానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రోజున ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తి అయినట్లు సమంత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసినట్లు సమాచారం.


ఇక శాకుంతలం చిత్రంలో దుష్యంతుడుగా నటిస్తున్న దేవ్ మోహన్ కు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రం బృందం . ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ లో దుశ్యంతుడు గుర్రంపై కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరి సమంత చిత్రం విడుదల కాక తెలుగులో దాదాపుగా ఇప్పటికీ రెండు సంవత్సరాలు పైనే కావస్తోంది. దీంతో సమంత సినిమాలపై అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇవే కాకుండా సమంత చేతిలో ప్రస్తుతం ఖుషి, యశోద తదితర సినిమాలలో నటిస్తూ ఉన్నది. బాలీవుడ్ లో కూడా నటిస్తున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: