సుధీర్ బాబు, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ టాలెంటెడ్ క్లాసిక్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది.అయితే మిగతా సినిమాలతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చినా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అయితే కాదని కామెంట్లు చాలా వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా హిట్ సాధిస్తే ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో నటించాలని ఇద్దరు హీరోలు భావించారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించని నేపథ్యంలో ఇంద్రగంటి మోహన కృష్ణకి ఇప్పుడు కొత్త సినిమా ఆఫర్లు రావడం చాలా కష్టమేనని కామెంట్లు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య గత రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయనే సంగతి తెలిసిందే. ఈ హీరో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించాల్సి ఉందని సమాచారం. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిజల్ట్ నేపథ్యంలో నాగచైతన్య ఏం చేస్తారో చూడాల్సి ఉంది. మరో హీరో విజయ్ దేవరకొండ కూడా ఇంద్రగంటి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.


స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది. లైగర్ ఫ్లాప్ తో ఢీలా పడిన విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని భావిస్తున్నారు. ఈ హీరో కూడా ఇంద్రగంటి మోహనకృష్ణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇంద్రగంటి మోహనకృష్ణ మళ్లీ ప్రూవ్ చేసుకుంటే మాత్రమే ఆయనకు కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.ఇంద్రగంటి మోహనకృష్ణ పరిమిత బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణకు ఛాన్స్ ఇచ్చేనిర్మాత ఎవరనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది. ఆయన క్లాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తీయడం వల్లే ఇంద్రగంటి సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరి చూడాలి ఇంద్రగంటి ఫ్యూచర్ ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: