ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా మారిన కృతిశెట్టి  మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత ఆమె చేసిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా ఒక మాదిరి హిట్గా నిలవగా బంగార్రాజు సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. అలా ఆమెకు మొదటి మూడు సినిమాలు బాగా కలిసి వచ్చాయి అని చెప్పాలి. అయితే ఆ తర్వాత ఆమె చేసిన మూడు సినిమాలు మాత్రం భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.

ఆమె రామ్ సరసన ది వారియర్ అనే సినిమాలోకి విజిల్ మహాలక్ష్మి అనే పాత్రలో నటించింది. ఈ రామ్ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో కూడా ద్విపాత్రాభినయం చేసింది.

కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ మీద దృష్టి పెట్టాలని పలువురు విశ్లేషకులు ఆమెకు సూచనలు చేస్తున్నారు. కృతి శెట్టి వయసు చిన్నదే అయినా ఆమె ఎలాంటి పాత్రల్లో ప్రజలు తనను చూడడానికి ఇష్టపడతారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. కేవలం హీరోల క్రేజ్ అలాగే మంచి రెమ్యునరేషన్ ఉంటే చాలు అనే విధంగా ఆమె ముందుకు వెళుతోందని అలాగే ముందుకు వెళితే ఆమె కెరీర్ కి అది బాగా మైనస్ అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇప్పటికైనా మంచి కథలు, నటనకు అవకాశం ఉన్న పాత్రలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెమ్యూనరేషన్ విషయం పక్కనపెడితే కొన్నాళ్లపాటు హీరోయిన్గా కొనసాగుతుందని లేదంటే మరికొన్ని సినిమాలు చేసి ఇక ఇంటికి వెళ్లిపోక తప్పదని వారు కామెంట్ చేస్తున్నారు. నిజానికి కృతి శెట్టి ప్రస్తుతానికి నాగచైతన్యతో ఒక సినిమా చేస్తోంది. అదే విధంగా సూర్య హీరోగా కూడా ఒక సినిమా చేస్తోంది.

ఈ రెండు సినిమాల ఫలితాలు కూడా ఏమైనా తేడా పడితే గోల్డెన్ లెగ్ అనే ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించిన వారే వెనకడుగు వేయక తప్పదని అంటున్నారు. మొత్తం మీద ఆమె పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ మీద దృష్టి పెడితే తప్ప ఆమె కెరీర్ మళ్ళీ పుంజుకోవడం అసాధ్యమని సినీ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. మరి వారి సలహాలను ఈ భామ ఎంతవరకు తీసుకుని తన కెరీర్ను నెక్స్ట్ లెవల్ కి తీసుకు వెళుతుంది అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: