ఒక కథను ఒక హీరోతో తెరకెక్కించాలని దర్శక , నిర్మాతలు ప్లాన్ చేయడం , అందులో భాగంగా ఓ హీరోకు కథను వినిపించడం ,  అప్పుడు ఉన్న సందర్భంలో ఆ హీరోకు ఆ కథ నచ్చక పోవడం లేదా ఆ సమయంలో ఆ మూవీకి డేట్ లను సర్దుబాటు చేయలేక ఆ సినిమా నుండి తప్పుకోవడం , అలాగే ఒక హీరో రిజెక్ట్ చేసిన కథను మరో హీరో తో తనకెక్కించిన సందర్భాలు సినిమా ఇండస్ట్రీలో అనేకం ఉన్నాయి. అలాగే  ఒక హీరోతో అనుకోని మరొక హీరోతో తెరకెక్కించిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడగా ,  మరి కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచినవి కూడా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తమిళ ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న సూర్య కూడా తన కెరియర్ లో కొన్ని మూవీ లను వదులుకున్నాడు. అందులో భాగంగా ఈ హీరో కొన్ని తెలుగు సినిమాలను కూడా వదులుకున్నట్లు తెలుస్తుంది. ఆ తెలుగు సినిమాలు ఏమిటో తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా  కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర సినిమా కథ ను మొదటగా సూర్య కే చెప్పారట ,  కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సూర్యమూవీ లో నటించకపోవడంతో చివరగా రామ్ చరణ్ తో ఈ మూవీ తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బిజినెస్ మాన్ మూవీ కథను కూడా మొదటగా సూర్య కి వినిపించగా కొన్ని అనివార్య కారణాల వల్ల సూర్య ఈ మూవీలో నటించలేకపోయినట్లు తెలుస్తుంది. ఇలా సూర్య ఈ రెండు తెలుగు మూవీలను వదులుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: