యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ తో గ్లోబల్ గా మార్కెట్ ను సంపాదించుకొని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో 30 వ మూవీ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయికి మించి 9 భాషల్లో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే కొరటాల శివ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో 31 వ మూవీ ని కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన గుర్తింపు ని తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పటికే తన కెరియర్ లో 30 వ మరియు 31 వ మూవీ లకు సంబంధించిన అధికారిక ప్రకటనలను విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత మూవీ ని కూడా ఇప్పటికే సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ ల తర్వాత ఉప్పెన మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను మరియు అంతకు మించిన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్క బోయే మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతునట్లు సమాచారం. ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తన తదుపరి మూవీ లకు సంబంధించిన అదిరి పోయే లైనప్ ని సెట్ చేసి పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: