దుల్కర్ సల్మాన్ హీరో గా మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే ప్రేమ కథ చిత్రం తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ని వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు . ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన విడుదల అయ్యి , భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించి అదే రేంజ్ లో కలెక్షన్ లను కూడా రాబట్టింది .

విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు  ఈ మూవీ విజయంలో విశాల్ చంద్రశేఖర్  అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది . రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  సుమంత్ ,  భూమిక చావ్లా ,  గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు . ఈ మూవీ అదిరి పోయే బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తో దుల్కర్ సల్మాన్ హీరో గా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీ స్ బ్యానర్ లో మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది .

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఇది ఇలా ఉంటే సీతా రామం మూవీ ద్వారా దుల్కర్ సల్మాన్ కు మృణాల్ ఠాకూర్ కు అలాగే హను రాగవకుడి కి ప్రేక్షకుల నుండి ,  విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: