ఇటీవల కాలంలో థియేటర్లలో ఎంతో సందడి చేసిన కొన్ని సినిమాలు యొక్క ఓ టీ టీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విడుదలైన రెండు మూడు వారాలలోనే ఒక
సినిమా ఓటిటిలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తుంది. ఆ విధంగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో ఘన విజయం సాధించిన కొన్ని సినిమాల యొక్క ఓటీటీ విడుదల తేదీ ఎప్పుడు అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.
అలాంటి వాటిలో ఒకటి బింబి సారా.
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ
సినిమా ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన
సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారో ఆ ఆసక్తికి తగ్గట్టుగానే ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ
సినిమా తప్పకుండా పోటీలో ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది అని అందరూ భావించారు.
అయితే ఈ
సినిమా విడుదల అయ్యి చాలా రోజులైవుతున్నా కూడా ఇంకా ఓ టీ టీ లో విడుదల చేయకపోవడం అందరిని నిరాశ పరుస్తుంది అనే చెప్పాలి. ఇకపోతే ఇటీవల కాలంలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మరొక
సినిమా కార్తికేయ2. నిఖిల్ హీరోగా నటించిన ఈ
సినిమా హిందీలో సైతం మంచి కలెక్షన్లను అందుకోవడంతో ఈ
సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని భావించారు. ఓటీటీ లు కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నేపద్యంలో ఇంకా ఈ
సినిమా ఓటీటీ లో విడుదల కాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తొందర్లోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని చెబుతున్న నేపథ్యంలో ఈ సినిమాలకు అక్కడ ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి. ఇవే కాకుండా
విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్
సినిమా యొక్క ఓటీ టీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.