టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు ఎక్కడైనా ప్రేమ కథా సినిమాలను తెరకెక్కించే దర్శకులకు భారీ స్థాయిలోనే డిమాండ్ ఉంటుంది. వారు తమ సినిమాల ద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తారు కాబట్టే వారికి ఇంతటి స్థాయిలో డిమాండ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ విధంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రేమ కథ సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా బాగా పాపులర్ అయ్యాడు హను రాఘవపూడి. తాను తన తొలి చిత్రంతో మొదలుకొని ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా మంచి ప్రేమ కథ సినిమాలే కావడం విశేషం.

అయితే వాటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చాయి. ఇంకొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కానీ ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం ఏ మాత్రం హను రాఘవపూడి వెనుకడుగు వేయలేదు అనే చెప్పాలి. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన సీతారామం ప్రేక్షకులు ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది.  ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఇంతటి స్థాయిలో విజయాన్ని అందుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.

సినిమా కు తెలుగులో వచ్చిన ఆదరణ చూసి చిత్ర నిర్మాతలు ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేసి అక్కడ భారీ విజయం దక్కేలా చేసుకున్నారు. మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా హను రాఘవ పూడి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అని చెప్పవచ్చు. ఆ విధంగా హను ఇటీవల విజయ్ దేవరకొండకు ఆయన ఓ సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒక మంచి కథ కుదిరితే తప్పకుండా అదే జరుగుతుంది అని దేవరకొండ కాంపౌండ్ చెబుతున్న నేపథ్యంలో ఎలాంటి కథను విజయ్ దేవరకొండ కు చెప్పి ఒప్పించి హను సినిమాను చేస్తాడో చూడాలి. విజయ్ దేవరకొండ కూడా హిట్ వచ్చే దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ దర్శకుడితో కథ బాగుంటే మాత్రం తప్పకుండా విజయ్ సినిమా చేస్తాడని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: