లైగర్ సినిమా తో ప్రేక్షకులను నిరాశపరిచిన క్రేజీ హీరో విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్స్ అందుకున్నా కూడా క్రేజ్ పరంగా భారీ స్థాయి లో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయన ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే అందమైన ప్రేమకథతో రాబోతున్నాడు విజయ్. డిసెంబర్ లో ఈ సినిమా ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ ప్రేమ కథా సినిమాలను ఏ స్థాయి లో ప్రేక్షకులను అలరించారో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఇప్పటికే మూడు సినిమాలను చేసిన ఈ దర్శకుడు ఆ సినిమా లతో ప్రేక్షకులను ఎంతో అలరించాడు. ఈ సినిమా లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సగభాగం పూర్తి కాగా ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తుంది.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతోంది. ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉన్న ఈ చిత్రం కాశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కింది. శివ నిర్వాణ కూడా ఈ సినిమా కోసం ఎంతో  కష్టపడి రూపొందిస్తున్నాడు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కాదన్న టాక్ వినిపిస్తోంది.

ఏదేమైనా ఇలాంటి వదంతులను పట్టించుకోకుండా శివ నిర్వాణసినిమా అనుకున్న టైం కి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నాడు.  సమంతకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. అయితే సామ్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఆమె పాల్గొనాల్సిన సన్నివేశాల షూటింగ్ లేట్ అవుతుందట. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియదు కానీ ఇదే నిజమైతే కనుక దాంతో ఈ సినిమా వెనక్కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. హిందీ లో కూడా ఈ సినిమా విడుదల కావాలని కోరుకుంటున్నారు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. ఇకపోతే డిసెంబర్ లో ఈ సినిమా విడుదల కు అడ్డంకి గా మరికొన్ని సినిమాలు రానున్నాయి. ఇప్పుడు రౌడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: