సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాలలోకి రాకముందే మంచి పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులలో ఆమె తెలుగు సినిమాలలోకి రావడాలనే డిమాండ్ పెంచేసింది. అలా అప్పటివరకు మలయాళం సినిమాలో హీరోయిన్ గా ఉన్న ఆమె ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన మత్తులో పడేసింది. అలా తొలి సినిమా తోనే ఆమె వేరే లెవెల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటిదాకా ఆమె అభిమానులు ఎదురుచూసిన క్షణం రావడంతో వారు ఎంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోయారు. అలా తక్కువ సమయంలోనే సాయి పల్లవి స్టార్ హీరోయిన్ రేస్ లోకి దూసుకొచ్చింది.

ఆ తర్వాత చేసిన సినెమాలతోనూ ఈ ముద్దుగుమ్మ అందరిని ఆకట్టుకుంది. డాన్స్ లతో అందరిని మైమరిపించే ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి నుంచి ఆమె సెలెక్టెడ్ గా సినిమాలు చేసుకుంటూ వచ్చి ప్రేక్షకులను అలరించింది.  గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు చేస్తోంది సాయి పల్లవి. అయితే ఆమె నటించిన గత సినిమా శ్యామ్ సింగ రాయ్ కాస్త గ్లామర్ రోల్ పెంచింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇప్పుడు ఎంతో క్రేజ్ పెరిగిపోయింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్ సినిమాలు కూడా చేస్తుంది సాయి పల్లవి.

ఇప్పుడు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకున్న హీరోయిన్ ఈమె.  మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె నటించిన రానా నటించిన విరాటపర్వం సినిమాతో మంచి హిట్‌ను అందుకుంది. అలాగే గార్గి అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇంత క్రేజ్ ఉండి కూడా ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడం నిజంగా అందరిని నిరాశపరుస్తుంది. తొందరగా ఆమె అభిమాలను ఉత్సాహపరచాలంటే సినిమా ను ఒకే చేయాల్సిందే. మలయాళంలో కూడా ఆమె సినిమాలు చేయకపోవడం దాని వెనుక కారణం ఏమై ఉంటుందా అన్న అనుమానాలను కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: