మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో కూడా క్రేజ్ అందుకోవడం విశేషం. మహానటి సినిమాతో ఆయన తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టారు ఆ విధంగా ఆ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు సీతారామం సినిమా తో. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఎంతటి స్థాయిలో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .

హిందీలో సైతం ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. ప్రేమ కథ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుందో అంటే దానికి కారణం దుల్కర్ సల్మాన్ అనే చెప్పాలి. తన సహజమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తు ఈ సినిమాను చేసిన దుల్కర్ ఇప్పుడు తెలుగులో మరొక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేశాడు అనే వార్తలు రావడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది. 

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఒక యువ దర్శకుడు తో ఆయన తెలుగులో తన తదుపరి సినిమా నువ చేయబోతున్నాడట. మరి ఈ సినిమాను కూడా సీతారామ సినిమాలోని చేసి ప్రేక్షకులను అలరిస్తాడా అనేది చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది ఈ ప్రకటనలో ఈ సినిమాలో నటించే నటీనటులతో పాటు సాంకేతిక నిప్పులను కూడా వెల్లడించనుంది చిత్ర బృందం. సీతారామన్ సినిమాతో ఆయనకు తెలుగులో భారీ స్థాయిలో డిమాండ్ పెరిగిపోగా మినిమం మార్కెట్ ఏర్పడడంతో దుల్కర్ సల్మాన్ దానిని మరింత స్ట్రాంగ్ చేసేందుకు ఈ విధమైన ఆలోచన చేశాడని తెలుస్తుంది. అటు మలయాళం లో కూడా తన సినిమాలను విడుదల చేస్తూ అక్కడ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. భవిష్యత్తులో ఆయన పాన్ ఇండియా స్థాయిలో హీరో అయిన కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు . 

మరింత సమాచారం తెలుసుకోండి: