ఇటీవల కార్తికేయ2 సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో నిఖిల్. ఇప్పుడు తన తదుపరి సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను ఇంకా పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ హీరోగా ఓ ప్రేమ కథ చిత్రం యొక్క స్క్రిప్టును రిపేర్లు చేస్తూ ఆ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం తనకు భారీ విజయాన్ని తెచ్చిపెడుతుంది అని కార్తికేయ 2 విజయోత్సహాన్ని కంటిన్యూ చేస్తుంది అని వారు భావిస్తున్నారు.

సుకుమార్ నిర్మాణంలో ఆయన కథ అందించిన ఈ 18 పేజెస్ సినిమాను ఇప్పటికే షూటింగ్ పూర్తి చేశారు. అయితే కార్తికేయ 2 సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా దానిని కూడా ప్లాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయాలని భావించిన నిఖిల్ సుకుమార్ కు ఈ కథలో కొన్ని మార్పులు సూచించగట. దానికి తగ్గట్లుగానే సుకుమార్ మార్పులు చేసి ఈ చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా రూపొందించబోతున్నారట. ఇకపోతే స్పై అనే మరొక సినిమాని కూడా నిఖిల్ చేయడానికి రంగం సిద్ధం చేశాడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో మొదలు కాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు తనకు క్రేజ్ పెరిగిన కారణంగా ఈ సినిమా యొక్క కథలో కూడా కొన్ని మార్పులు చేస్తున్నాడట.

ఆ విధంగా నిఖిల్ తన కొత్త సినిమాలకు సంబంధించి ఈ విధమైన మార్పులు చేయడం నిర్మాతలకు కొంత తలనొప్పిగా మారుతుందని చెబుతున్నారు.  అంతే కాదు తన సినిమాలకు సంబంధించిన బడ్జెట్లను కూడా పెంచాలని నిఖిల్ సూచిస్తున్నాడట. కార్తికేయ సినిమా కంటే ముందుగా ఒప్పుకున్న సినిమాలు కాబట్టి వారు ఈ సినిమాలకు బడ్జెట్లను పెంచే ధైర్యం చేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా నిఖిల్ ఒక మంచి సాలిడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకొని ఇప్పుడు ఇంతటిస్థాయి డిమాండ్ ను క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: