టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం ఏ. దయాకర్ రావుతో కలిసి ఈ భారీ పీరియాడికల్ మూవీని నిర్మిస్తున్నారు. 17వ శతాబ్ద కాలం నాటి ముఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఓ బందిపోటు దొంగ కథగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కోవిడ్ తరువాత నుంచి నత్తనడకన సాగుతున్న ఈ మూవీ షూటింగ్ విషయంతో పాటు పవన్ తదుపరి ప్రాజెక్ట్ ల విషయంలోనూ అభిమానులు గత కొన్ని నెలలుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఇదిలా వుంటే వచ్చే ఎన్నికల కోసం పవన్ కల్యాణ్ ఆక్టోబర్ 5 నుంచి ఏపీ అంతటా బస్ యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పవన్ బస్ యాత్ర పూర్తి చేసేంత వరకు సినిమాకు బ్రకేక్ పడినట్టేనని ఫ్యాన్స్ ఫీలయ్యారు.అయితే తాజాగా పవన్ కల్యాణ్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దసరా ఫెస్టివల్ రోజు యాత్రని ప్రారంభించి ఏపీ అంతటా పర్యటించాలనుకున్నారట.


అయితే ఈ ప్లాన్ ని తాజాగా మార్చినట్టుగా తెలుస్తోంది.జనసేన వర్గాల సూచనల మేరకు ఇంత త్వరగా బస్ యాత్ర చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం వుండదని వచ్చే ఏడాది బస్ యాత్రని ప్రారంబిద్దామని సూచించాయట. దీంతో కన్విన్స్ అయిన పవన్ కల్యాణ్ ఏపీ బస్ యాత్రని పోస్ట్ పోన్ చేసుకుని సినిమా షూటింగ్ లకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్త విన్నవారంతా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి రోజులొచ్చినట్టేనా? అని కామెంట్ లు చేస్తున్నారు. వచ్చే నెల నుంచి సినిమాల షూటింగ్ లకు పవన్ డేట్స్ కేటాయించబోతున్నాడట.ఇక ఈ 'హరి హర వీరమల్లు' మూవీ ఇప్పటి వరకు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల నుంచి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే దర్శకుడు క్రిష్ మిగతా భాగాన్ని రాకెట్ స్పీడుతో పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 23న రిలీజ్ చేయాలని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: