తెలుగు ఇండస్ట్రీలో హీరో నిఖిల్ కెరియర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో వైపుగా అడుగులు వేస్తున్నారు. కార్తికేయ సినిమా నుంచి మంచి విజయాలను అందుకుంటూ ఉన్నారు. కార్తికేయ, అర్జున్ సురవరం, స్వామి రారా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ -2 ఇలా మంచి విజయాలను అందుకున్న నిఖిల్ కార్తికేయ 2 సినిమా రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇక చందు మండేటి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్గా మంచి విజయాలను రాబట్టడమే కాకుండా కలేక్షన్ కూడా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా అన్ని భాషలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.


మొదట ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే విధంగా మారిపోయింది. అయితే కేరళలో మాత్రం ఈ సినిమా ఇంతవరకు విడుదల చేయలేదు సెప్టెంబర్ 23న అక్కడ కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే సమయంలో కేరళలో నిఖిల్ నటిస్తున్న మరొక పాన్ ఇండియా చిత్రం స్పై కూడా అక్కడే షూటింగ్ జరుగుతున్నట్లుగా సమాచారం. ఒకపక్క కార్తికేయ -2 సినిమా ప్రమోషన్స్లో పాల్గొనడానికి ఆ తరువాత స్పై సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటూ ఉన్నట్లు తెలుస్తోంది.

స్పై చిత్రాన్ని డైరెక్టర్ గ్వారి బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై చరన్ తేజ్ ఉప్పలపాటి చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. పాన్ ఇండియాగా కూడా ఈ చిత్రం ఐదు భాషలలో విడుదల కానుంది ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు సమాచారం. కథల విషయంలో హీరో నిఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. నిఖిల్ నటించిన కార్తికేయ-2 చిత్రం విజయవంతం కావడంతో తను నటించిన 18 పేజీస్ చిత్రాన్ని కూడా రీ షూటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ యువ హీరో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా రేంజ్ లో హీరోగా ఎదిగాడని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: