ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో రికార్డులు సృష్టించింది. తాజాగా మరో రికార్డుని కూడా సృష్టించింది. ఇక ఒకప్పుడు ఉగ్రవాదంతో నిత్యం కల్లోల పరిస్థితులతో అతలాకుతలమైన జమ్ముకశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత అక్కడ సినిమా హాళ్లు తెరుచుకోవడం విశేషం.అందులోనూ తొలిసారిగా  ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శించారు.కాగా దక్షిణ కశ్మీర్లోని పుల్వామా శోపియాలలో సెప్టెంబర్ 18న ఆదివారం మల్టీపర్పస్ సినిమా హాళ్లను జమ్ముకశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఒకదానిలో ఆర్ఆర్ఆర్ సినిమాను మరో హాళ్లో బాగ్ మిల్కా బాగ్ సినిమాను ప్రదర్శించారు. కాగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మిషన్ యూత్ విభాగం ఆయా జిల్లా యంత్రాంగాలు కలిసి ఈ మల్టీప్లెక్సులను నిర్మించాయి. భవిష్యత్లో జమ్ములోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్ను నెలకొల్పుతామని మనోజ్ సిన్హా తెలిపారు.ప్రస్తుతం ప్రారంభించిన సినిమా హాళ్లను పుల్వామా శోపియా యువతకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు.


 30 ఏళ్ల తర్వాత జమ్ముకశ్మీర్లో సినిమా హాళ్లు తెరుచుకోవడాన్ని చరిత్రాత్మక ఘటనగా ఆయన అభివర్ణించడం విశేషం.త్వరలోనే జమ్ముకశ్మీర్లో అనంత్నాగ్ శ్రీనగర్ బందిపోరా గందర్బల్ దోడా రాజౌరి ఫూంచ్ కిష్ట్వార్ రియాసీలలో సినిమా థియేటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు అధికారులు తెలిపారు. కేవలం సినిమాల ప్రదర్శనే కాకుండా ఇన్ఫోటెయిన్మెంట్ నైపుణ్యాభివృద్ధి కోసం కూడా మాల్స్లో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.మరోవైపు వచ్చే వారం కశ్మీర్లో తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. శ్రీనగర్లోని సోమ్వార్ ప్రాంతంలో దీన్ని సెప్టెంబర్ 27న ప్రారంభిస్తున్నారు. ఇందులో 520 మంది కూర్చోవడానికి వీలుగా మూడు స్క్రీన్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇందులో మొదటి సినిమాగా ఇటీవల అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దాను ప్రదర్శించనున్నారు.ఏది ఏమైనా మన తెలుగు సినిమా అక్కడ ప్రదర్శించడం నిజంగా మనకి గర్వ కారణమనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: