రౌడీ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా సినిమా చేసే స్థాయికి అయితే ఎదిగారు.


ఇలా పాన్ ఇండియా స్థాయిలో పూరి జగన్నాథ దర్శకత్వంలో తెరకేక్కిన లైగర్ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఊహించని విధంగా అయితే డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఇలా ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈయన ఆలోచనలో పడ్డారు.


ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి విజయ్ దేవరకొండ గురించి ఆయన సినీ కెరియర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారట. విజయ్ దేవరకొండ నటించిన సినిమా గతంలో ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈయన చెప్పిన విధంగానే లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈయన చెప్పింది నిజమేనని పలువురు కూడా భావిస్తున్నారు. వేణు స్వామి విజయ్ దేవరకొండ జాతకం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం విజయ్ దేవరకొండ జాతకంలో అష్టమ శని నడుస్తుందని,


 


ఈ శని ప్రభావం మరికొన్ని రోజులపాటు ఉండటం వల్ల ఈయన చేసే సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయంటూ ఈయన తెలియజేశారు.అలాగే ఈయన కెరియర్ విషయానికి వస్తే ఒక రెండు మూడు సినిమాలు ఈయనకు సానుకూలం గా ఉన్నప్పటి కీ అనంతరం ఈయన కెరియర్ కష్టాల ను ఎదుర్కొంటుందని తెలిపారు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోల కు సమానంగా ఈయన కెరియర్ కొనసాగదంటూ వేణు స్వామి ఈయన సినీ కెరియర్ గురించి జోష్యం చెప్పారట..


 


ఇలా విజయ్ దేవరకొండ గురించి వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో విజయ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నార ట.ఇక విజయ్ తదుపరి సినిమాల విషయాని కొస్తే ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత తో కలిసి ఖుషి సినిమా లో నటిస్తున్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి: