టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ నటించిన మిస్టిక్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ 'కార్తికేయ 2' ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విడుదలకు ముందు ఈ సినిమా ఏకంగా రెండు సార్లు వాయిదాపడి ఎట్టకేలకు ఆగస్టు 13న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఊహించని విధంగా వరల్డ్ వైడ్ గా 120 కోట్లకు పైగా భారీ వసూళ్లని రాబట్టింది.నార్త్ ఇండియాలో చిన్న సినిమాగా లిమిటెడ్ థియేటర్లలో ముందు విడుదలైన ఈ మూవీకి ఆ తరువాత వెయ్యికి పైగా థియేటర్లు లభించడం రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఉత్తరాదిలోని హిందీ బెల్ట్ లో ఈ మూవీ రూ. 30 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడం రికార్డుగా నిలిచింది.ఇప్పటికి బాలీవుడ్ లో వసూళ్లని రాబడుతున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది.


ఈ మూవీని కేరళలో ఇంత వరకు చిత్ర బృందం ఈ మూవీని రిలీజ్ చేయలేదు.సెప్టెంబర్ 23న అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో కేరళలో నిఖిల్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ 'స్పై' షూటింగ్ జరుపుకుంటోంది. ఒ పక్క 'కార్తికేయ 2' ప్రమోషన్స్ చేస్తూనే నిఖిల్ తను నటిస్తున్న స్పై థ్రిల్లర్ 'స్పై' షూటింగ్ లో పాల్గొంటుండటం విశేషం. 'స్పై' మూవీని గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చరణ్ తేజ్ ఉప్పలపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ మూవీని ఐదు భాషల్లో దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇక కార్తికేయ 2 సినిమా ఊహించని రేంజ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నిఖిల్ తరువాతి సినిమాల పై కూడా ఎన్నో భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమాతో నిఖిల్ కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: