ఆరు సినిమాల వరస ఫ్లాప్ ల తరువాత శర్వానంద్ కు కోరుకున్న బ్రేక్ ‘ఒకే ఒక జీవితం’ ఇచ్చింది. ఈ మూవీ తక్కువ బడ్జెట్ తో నిర్మాణం పూర్తిచేసుకావడంతో ఈ మూవీకి వచ్చిన టోటల్ పాజిటివ్ టాక్ రీత్యా ఈ మూవీ నిర్మాతలు మొదటివారం పూర్తి అయ్యేసరికి సేఫ్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

 ఈమూవీని తీసిన దర్శకుడు ఈమూవీ కథ స్క్రీన్ ప్లే విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈమూవీ ఖచ్చితంగా హిట్ జాబితాలో చేరి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయం. ఈమూవీ కథ అంతా టైమ్ మిషన్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు అదే స్టోరీ లైన్ ప్రభాస్ నాగ్ అశ్విన్ ల మూవీ ప్రాజెక్ట్ విషయంలో కూడ ఉండే ఆస్కారం ఉంది అంటూ కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.

 

 
‘ఒకే ఒక జీవితం’ సినిమాలో హీరోలు ముగ్గురు తమ చిన్న తనంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి టైమ్ మిషన్ ద్వారా తమ చిన్నతనంలోకి వెళతారు. ప్రభాస్ నాగ్ అశ్విన్ ల సినిమా కథలో కూడ ఇలాంటి పాయింట్ ను వేరే కోణంలో చెప్పినప్పటికీ ఈ మూవీని చూసినవారికి ఎక్కడో అక్కడ ‘ఒకే ఒక జీవితం’ కథ గుర్తుకు వస్తుందని ఒక విచిత్రమైన ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది.

 

 వాస్తవానికి ప్రభాస్ నాగ్ అశ్విన్ ల మూవీ ప్రాజెక్ట్ ను 500 కోట్ల భారీ బడ్జెట్ తో చాల భారీ స్థాయిలో తీస్తున్నారు. ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్స్ కోసమే 200 కోట్ల ఖర్చు అవుతుందని ప్రచారం జరుగుతోంది. దీనితో కావాలని ప్రభాస్ వ్యతిరేకులు కొందరు ఇలాంటి నెగిటివ్ రూమర్స్ పుట్టించి హడావిడి చేస్తున్నారు తప్ప శర్వానంద్ మూవీకి ప్రభాస్ మూవీకి పోలిక ఎక్కడ అంటూ ప్రభాస్ అభిమానులు చెపుతున్నప్పటికీ లోలోపల భయపడుతున్నట్లు టాక్. టాప్ హీరోల సినిమాల పై విడుదల కాకుండానే ఎలాంటి నెగిటివ్ ప్రచారం జరుగుతుందో ఇదే ఉదాహరణ..

మరింత సమాచారం తెలుసుకోండి: