టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నిఖిల్ తాజాగా కార్తికేయ 2 మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి ,  వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. కార్తికేయ 2 మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కింది.  

కార్తికేయ మూవీ కి సీక్వల్ గా తెరకెక్కడంతో కార్తికేయ 2 మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టు కున్నారు. అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13 వ తేదీన మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయ్యింది.  ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. దానితో కార్తికేయ 2 మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్ లు కూడా దక్కాయి.

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి అద్భుత మైన కలెక్షన్ లను సొంతం చేసుకున్న కార్తికేయ 2 మూవీ మరి కొన్ని రోజుల్లోనే 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 మూవీ 'ఓ టి టి' స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినట్టు వంటి జీ 5 'ఓ టి టి' సంస్థ దక్కించుకున్నట్లు జీ 5 'ఓ టి టి' సంస్థ కార్తికేయ 2 మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన లేదా అక్టోబర్ 7 వ తేదీన జీ 5 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: