తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు సక్సెస్ లేకుంటే చిన్న హీరోలు సైతం పట్టించుకోరు. ఆ విధంగా మంచి విజయాలను అందుకోవాలి అంటే హీరోయిన్లకు సక్సెస్ ఉండాల్సిందే. అలా ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో ప్రేక్షకులను తన అందాలతో ఎంతగానో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజపుత్ ఇప్పుడు టాలీవుడ్ లో మంచి అవకాశాలను అందుకోవడం విశేషం. తొలి సినిమా నుంచి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన కెరియర్ ను ఎంతో కష్టంగా నెట్టుకు వస్తుంది అని చెప్పాలి. కారణం ఏదైనా కూడా ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన భామ పాయల్ రాజ్ పుత్.

సినిమా లో ఆమె చూపించిన అందాలకు ప్రేక్షక లోకం ఫిదా అయ్యింది. ఈ ఒక్క సినిమా ద్వారా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పటినుంచి సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న పాయల్ కు యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఆమె సోషల్ మీడియా లో కూడా చేసే అందాల హల్చల్ అంతా ఇంతా కాదు. రోజుకో కొత్త ఫోటో పెడుతూ  ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పాయల్ తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కు గిలిగింతలు పెడుతూనే ఉంది.

తెలుగు లో ఆమె హీరోయిన్ గా మాత్రమే కాదు తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా చేసిన సీత చిత్రంలో ఐటెం సాంగ్ చేసి యువతకు గిలిగింతలు పెట్టింది. ప్రస్తుతం ఆమె మంచు విష్ణు హీరో గా నటించిన జిన్నా సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఇద్దరి కి ఇది ఎంతో కీలకమైన సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా గత సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచాడు. ఇప్పుడు వారి కెరీర్ లు నిలబడాలంటే తప్పకుండా ఈ సినిమా తో విజయాలను అందుకోవాల్సిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: