సత్యదేవ్ హీరోగా నటించిన శీతాకాలం గుర్తుందా అనే సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడడం ఆ సినిమా యొక్క అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది. వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో ఎన్నో అంచనాలు పెట్టుకుని చేసిన ఈ సినిమా చాలా రోజులుగా వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్. పలు కారణాల వల్ల ఈ సినిమా ప్రతిసారి వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమాను మళ్ళీ విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. తొందర్లోనే సరికొత్త విడుదల తేదీని ప్రకటించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

తమన్నా హీరోయిన్ నటించడంతో ఈ సినిమాపై ఎంతటి స్థాయిలో బజ్ ఏర్పడుతుంది అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత తమన్నా ఒక ప్రేమకథ సినిమాలో నటించడం తో ఈ సినిమాను చూడడానికి ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాలో మంచి రొమాన్స్ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ విధంగా సినిమా వాయిదా పడడం సినిమాపై ఆ సినిమా యొక్క ఫలితం పై ఏదైనా ఎఫెక్ట్ పడుతుందో అందరూ భావించారు.

కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా వాయిదా పడడం వల్లనే మంచి బజ్ క్రియేట్ అవుతుంది అని చెప్పాలి. కొన్ని సినిమాలకు ఇలాంటివి పెద్ద మైనస్ అవుతాయి. కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడ్డ ప్రతిసారి సినిమా గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎక్కువగా డిస్కస్ అవుతుంది కాబట్టే ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అందుకే ఈ సినిమా పై టాక్ పెరుగుతుంది అని చెప్పొచ్చు.మరి ఈ సినిమా యొక్క కొత్త విడుదల తేదీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇప్పటికే వచ్చిన అప్డేట్ లు ప్రేక్షకులను ఎంతో అలరించగా ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను అందుకుంటుందా అనేది చూడాలి. రొమాంటిక్ సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా కన్నడ సినిమా కు రీమేక్ గా రూపొందుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: