తెలుగు సినిమాల్లో కామెడీ కింగ్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు బ్రహ్మానందం. ఏ సోషల్ మీడియా అకౌంట్ లేకుండా సోషల్ మీడియాని షేక్ చేసే పర్సనాలిటీ మన బ్రహ్మి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయన లేని మీమ్ అంటూ ఉండదు. అందుకే ఆయన్ని మీమ్స్ గాడ్ అని పిలుస్తుంటారు. ఇక సినిమాల్లో ఆయన చేసే హంగమా కామెడీ హాస్య ప్రియుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుందన్నది తెలిసిందే. అందుకే ఒక దశలో ఆయన లేని సినిమా అంటూ లేదు.అంతగా ఆయన ప్రభావితం చేశారు. తెలుగులో ఎంతో మంది హాస్య నటులున్నా బ్రహ్మీగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ఆయన స్టైలే సెపరేటు. దీంతో ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు కడుపుబ్బా నవ్వుకునే వాళ్లున్నారు. తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లోనూ బ్రహ్మానందం ఫేవరేట్ కామెడియన్ అయ్యారు.ఇక త్వరలో  హుందాగా కనిపిస్తూ `రంగ మార్తాండ` మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా వుంటే మళ్లీ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు బ్రహ్మానందం. మంగళవారం సెట్ లోకి ఐట్ షార్ట్ హాఫ్ షర్ట్ బ్లాక్ గాగుల్స్ ధరించి ఫుల్ స్వాగ్ లో ఎంట్రీ ఇస్తున్న బ్రహ్మానందం వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.


నటుడు బ్రహ్మాజీ ఈ వీడియోని వర్ణిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. గత కొంత కాలంగా తనదైన మార్కు కామెడీకి దూరంగా వుంటున్న బ్రహ్మీని నెటిజన్ లు నెట్టింట మీమ్స్ తో వైరల్ చేస్తున్నారు. తాజాగా బ్రహ్మానందం స్వాగ్ తో సెట్ లోకి యమ స్టైల్ గా ఎంట్రీ ఇస్తున్న వీడియోని చూసిన వారంతా అట్లుంటది బ్రహ్మి స్వాగ్ అంటే అని ఇంకా ఇది కదా బ్రహ్మీ అసలైన స్వాగ్ అంటే అని నెట్టింట ఈ వీడియోపై కామెంట్ లు చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.`చంటబ్బాయి`తో మొదలైన బ్రహ్మానందం కామెడీ ప్రస్థానం ' భీమ్లా నాయక్' వరకు సాఫీగా సాగింది. ఎన్నో సినిమాల్లో నటించి నవ్వులు పూయించారు. అయితే ఆ తరువాత ఆ స్థాయిలో నవ్వులు పూయించడం లేదు. చాలా వరకు సినిమాలు కూడా తగ్గించుకున్నారు. చిన్న చిన్న పాత్రల్లో మాత్రమే కనిపిస్తూ నేనూ ఉన్నానంటున్నారే కానీ తన మార్కు కామెడీని మాత్రం ఈమధ్య అందించే అవకాశం రాలేదు. ఇక చూడాలి ఫ్యూచర్ లో బ్రహ్మి తన మార్క్ కామెడీతో అల్లరిస్తాడో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: