అఖిల్ హీరో కాకముందు తన చిన్నతనంలో రాత్రి సమయంలో ‘ఘోస్ట్’ సినిమాలను చూసి నిద్రపట్టక తన బెడ్ రూమ్ లో లైట్లు వేసుకుని పడుకునే వాడినని అని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అఖిల్ ఇప్పుడు హీరో అయినప్పటికీ ఆ ఘోస్ట్ భయాలు అతడిని వెంటాడుతున్నాయా అని అనిపిస్తోంది. దీనికికారణం అఖిల్ సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ‘ఏజెంట్’ మూవీకి అఖిల్ తండ్రి నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ మూవీకి కొన్ని సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


వాస్తవానికి అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ చిత్రీకరణ పూర్తి కావడంతో ఆమూవీని గత ఆగష్టులో విడుదల చేయాలని భావించారు. అయితే ఈమూవీ ఫైనల్ అవుట్ పుట్ చూసిన నాగార్జున ఆమూవీ పై కొంత అసంతృప్తి వ్యక్తపరిచి ఆమూవీలోని కొన్ని సీన్స్ రీ షూట్ చేయడమే కాకుండా ఆమూవీ గ్రాఫిక్స్ వర్క్స్ తనకు సంతృప్తిగా లేదు అని చెప్పడంతో ఆమూవీకి రిపేర్లు చేస్తూ ఆమూవీ విడుదలను డిసెంబర్ కు వాయిదా వేయవలసి వచ్చింది అని అంటున్నారు.


నిజానికి దసరా రేస్ కు విడుదలకాబోతున్న నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీలో కూడ గ్రాఫిక్ వర్క్స్ బాగా ఉన్నట్లు టాక్. అయితే ఆమూవీ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ గ్రాఫిక్స్ విషయంలో చాల శ్రద్ధ తీసుకావడంతో ఆమూవీకి గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణగా మారాయి అని నాగార్జున అభిప్రాయం అని అంటున్నారు. అలాంటి క్వాలిటీ గ్రాఫిక్స్ అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ మూవీలో కనిపించకపోవడంతో నాగార్జున రంగంలోకి దిగి ఆమూవీ రిపేర్ల పై దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి వరస ఫ్లాప్ లలో ఉన్న అఖిల్ కు గత సంవత్సరం విడుదలైన అఖిల్ కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ఒక టర్నింగ్ పాయింట్ ని ఇచ్చింది. ఇప్పుడు ఆ హిట్ ట్రాక్ అఖిల్ తన ‘ఏజెంట్’ మూవీతో కొనసాగించవలసిన అవసరం ఉంది. దీనితో నాగార్జునకు సెంటిమెంట్ పరంగా కలిసి వచ్చే డిసెంబర్ లో అఖిల్ ‘ఏజెంట్’ విడుదల అవుతోంది. దీనితో నాగార్జున ఇస్తున్న సలహాలు అతడి సెంటిమెంట్ డిసెంబర్ లో రాబోతున్న ‘ఏజెంట్’ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: