ఒకప్పుడు మణిరత్నం సినిమా విడుదల అవుతోంది అంటే దక్షిణ భారత సినిమా ప్రేక్షకులు అంతా చాల ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండేవారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులకు బాగా నచ్చేవి. అయితే మారిన కాలంలో మారిపోయిన ప్రేక్షకుల అభిరుచులను పట్టుకునే నాడి మణిరత్నం మిస్ అయ్యాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


వాస్తవానికి మణిరత్నం గతంలో తీసిన సినిమాలు అన్నీ స్ట్రైట్ తెలుగు సినిమాలు లా ఉండేవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మణిరత్నం తీసిన సినిమాలను పరిశీలించిన వారు ఆ సినిమాలలో తమిళ వాసన ఎక్కువగా ఉంది అన్న కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు మణిరత్నం తీసిన తెలుగు వర్షన్ సినిమాలకు రాజశ్రీ సంభాషణలు వ్రాస్తూ ఉండేవాడు కాబట్టి ఆ సంభాషణలు తెలుగు నేటివిటీ లో ఉండేవి.


అయితే రాజశ్రీ మరణం తరువాత మణిరత్నం సినిమాలకు తెలుగులో మంచి డైలాగ్స్ వ్రాసే మాటల రచయితలు మణిరత్నం కు సరిగ్గా మ్యాచ్ అవ్వడం లేదు. గతంలో మణిరత్నం సూపర్ హిట్ సినిమాలకు వేటూరి లాంటి తెలుగు భాష పై పట్టు ఉన్న పాటల రచయితలు వ్రాసేవారు కాబట్టి ఆపాటలు విన్న వారికి తెలుగు సినిమా అని అనిపించేది. లేటెస్ట్ గా ఈ నెలలో విడుదల కాబోతున్న ‘పొన్నియన్ సెల్వన్’ మూవీ పాటలు విన్నవారు తీవ్ర గందరగోళానికి గురి అవుతున్నారు.


ఈ మూవీకి పాటలు వ్రాసిన అనంత శ్రీరామ్ అయోమయుడు లాంటి చిత్ర విచిత్ర ప్రయోగాలను ఈ మూవీ పాటలలో చేయడంతో పాటు ఆ పాటల ట్యూన్స్ ఏమాత్రం బాగా లేకపోవడంతో మణిరత్నం ఇలాంటి సినిమాలను ఎందుకు తీస్తున్నారు అన్న సందేహం ఆయన అభిమానులకు కూడ ఏర్పడటంతో ఈ మూవీ పై ఎలాంటి క్రేజ్ ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులలో ఏర్పడక పోవడం ఆశ్చర్యంగా మారింది. దీనితో మణిరత్నంకు మరొకసారి భంగపాటు తప్పదా అన్న సందేహాలు కలుగుతూ ‘పోన్నియన్ సెల్వన్’ విజయం పై సందేహాలు ఏర్పడుతున్నాయి..



 


మరింత సమాచారం తెలుసుకోండి: