అక్టోబర్ 5కు ఇంకా కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీకి ఇంకా మ్యానియా ఏర్పడకపోవడం వెనుక కారణాలు ఏమిటి అంటూ మెగా అభిమానులు తీవ్ర అంతర్మధనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆచార్య’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో మెగా అభిమానులు ‘గాడ్ ఫాదర్’ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.


ఈ అంచనాలకు అనుగుణంగా ఈమూవీ నిర్మాతలు ఈమూవీకి భారీ పబ్లిసిటీ చేస్తారని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే జరుగుతున్న పరిణామాలు మెగా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా లేవు అన్న లీకులు వస్తున్నాయి. దీనికికారణం ఈమూవీలోని ‘తార్ మార్ టక్కర్ మార్’ పూర్తి సాంగ్ విడుదలలో జరుగుతున్న ఆలస్యం అని అంటున్నారు.


వాస్తావానికి ఈమూవీ నిర్మాతలు ఈ పాటను నాలుగు రోజుల క్రితమే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే కొన్ని అనివార్యకారణాలు వల్ల ఈపాట విడుదలలో ఆలస్యం అవుతోందని ఈమూవీ నిర్మాతల నుండి మెగా అభిమానులకు లీకులు వస్తున్నట్లు టాక్. దీనితో మెగా అభిమానులు తీవ్ర అసహనానికి లోనుకావడమే కాకుండా అసలు ఈమూవీ అనుకున్న విధంగా దసరా రేస్ కు విడుదల అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


మరొక వైపు నాగార్జున తన ‘ది ఘోస్ట్’ మూవీ ప్రమోషన్ ను మొదలు పెట్టడమే కాకుండా ఏకంగా ‘బిగ్ బాస్’ షోలో ఈమూవీ గురించి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన తమన్నా తో ఈమూవీ పై ప్రశంసలు కురిపించేలా ప్రోగ్రామ్ ను దిజైన్క్ హేసారు. ఇంత జరుగుతున్నా ‘గాడ్ ఫాదర్’ నిర్మాతలు మాత్రం ఈమూవీ ప్రమోషన్ విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అంటూ మెగా అభిమానుల వాదన. ఇది ఇలా ఉంటే ఈమూవీ బిజినెస్ ఊహించిన స్థాయిలో జరగడం లేదు అన్న గాసిప్పులు కూడ మెగా అభిమానులకు టెన్షన్ క్రియేట్ చేస్తూ ‘గాడ్ ఫాదర్’ పై సందేహాలను కలిగిస్తున్నాయి..మరింత సమాచారం తెలుసుకోండి: