రాజకీయాలు సినిమాలు సమాంతరంగా కొనసాగిస్తూ నిరంతరం వార్తలలో నిలుస్తున్న పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్ళాడని సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న వార్తలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈమధ్యనే పవన్ వచ్చే ఎన్నికలలో వైసీపి పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు లేవు అంటూ చేసిన కామెంట్స్ పై పవన్ ను టార్గెట్ చేస్తూ చాలామంది వైసీపి పార్టీ ప్రముఖులు ఘాటైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.


ఈపరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనకు సంబంధించి వస్తున్న వార్తల్లో నిజం ఎంతా అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మీడియాలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం పవన్ ఒక వ్యక్తిగత వ్యవహారం పై వెళ్ళాడు అని కొందరు వేలుతున్నాడని కొందరు చెపుతూ ఉంటే మరికొందరు పవన్ అమెరికా పర్యటన వెనుక మరొక కారణం ఉంది అంటూ ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి.


వాస్తవానికి పవన్ బస్సు యాత్ర వాయిదా పడటంతో ఇక అతడు సినిమా షూటింగ్ లలో బిజీ అవుతాడని అందరు భావించారు. వాస్తవానికి పవన్ అక్టోబర్ 16 నుండి తన ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొని ఆమూవీకి సంబంధించిన తన పార్ట్ ను వీలైనంత వేగంగా పూర్తి చేసి ఆతరువాత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర మొదలుపెడతాడని ఊహాగానాలు వచ్చాయి.


ఇది ఇలా ఉండగా బాలకృష్ణ త్వరలో ప్రారంభించబోతున్న ‘అన్ ష్టాపబుల్’ టాక్ షోకు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ లను అతిధులుగా పిలవాలని ఆకార్యక్రమ నిర్వాహకులు చాల గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఈవిషయమై పవన్ త్రివిక్రమ్ లు అంత సుమఖంగా లేరు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు పవన్ దేవీ నవరాత్రుల సమయంలో దీక్షలో ఉంటాడు. దీనితో ఇన్ని పనులు అక్టోబర్ లో పవన్ పూర్తి చేయగలడా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే పవన్ అభిమానులు మాత్రం పవన్ నుంచి సినిమాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయి అంటూ ఆశతో ఎదురు చూస్తున్నారు..
మరింత సమాచారం తెలుసుకోండి: