తెలుగులో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన హీరోయిన్ పూజ హెగ్డే కూడా ఒకరు. ఈమె క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రేక్షకులలో విపరీతంగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వరస సినిమా ప్లాపులు ఎదురైనా కూడా పూజ హెగ్డే సినిమాల విషయంలో అభిమానుల విషయంలో ఎక్కడ తగ్గలేదని చెప్పవచ్చు. తాజాగా పూజ హెగ్డే స్టార్డమ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రేంజ్ కు రావడానికి తను చాలా కష్టపడ్డాను అని ఆ విషయం తనకి మాత్రమే తెలుసని చెప్పుకోస్తోంది పూజ హెగ్డే.


ఈ స్థాయికి రావడం కోసం తన ఇష్టా ఇష్టాలను సైతం వదులుకున్నానని ఈ ముద్దుగుమ్మ తెలియజేస్తుంది. ఇక కుటుంబానికి కూడ దూరంగా ఎన్నో రోజులు గడపవలసి  వస్తోంది అంటే తెలియజేసింది కాకపోతే నేనెప్పుడూ ఒక స్టార్ లా ఫీల్ అవ్వలేదని ఆమె తెలియజేస్తోంది. ఇక స్టార్డమ్ అనేది నేనెప్పుడూ తలుచుకోలేదని కూడా ఆమె తెలియజేస్తుంది. ప్రస్తుతం నేను ఇప్పటికీ నేల మీదే ఉన్నానని తెలిపింది. గతంలో తనని ఐరన్ లెగ్ అన్న వాళ్లు కూడా ఇప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ అంటూ పొగిడేస్తున్నారు తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఐరన్ లెగ్ అన్న సమయంలో తనని ఎంతోమంది అన్నారని.. ఆ విషయాన్ని కూడా స్వీకరించానని.. సినీ రంగంలో స్టార్డమ్ అనేది ఎప్పటికీ శాశ్వతం కాదని తెలియజేస్తోంది.


అందుచేతనే స్టార్డమ్ విషయంపై నేను ఎప్పుడూ కూడా అంతగా ఆలోచించలేదని పూజ హెగ్డే తెలియజేస్తోంది. సినిమాలలో సరిగ్గా యాక్ట్ చేయలేదంటే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ప్రేక్షకులు సైతం తిప్పికొడతారని తెలియజేస్తోంది. అందుచేతనే నేను స్టార్డమ్ వంటి పదాలకు పెద్దగా వాల్యూ ఇవ్వానని కూడా తెలియజేస్తోంది. పూజా హెగ్డే తెలియజేసిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం మహేష్ గారు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపిక అయింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: