సెప్టెంబర్ నెలలో విడుదలవుతున్న సినిమాలలో ఒకటి రెండు సినిమాలకు మంచి బజ్ ఏర్పడింది.. కానీ ఆ సినిమాలు అంతగా ఏమీ ఆకట్టుకోలేకపోయాయి. అయితే అక్టోబర్ నెలలో మాత్రం మంచి సినిమాలు విడుదలవుతూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రెండు బడా సినిమాలు కూడా విడుదల అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ 5వ తేదీన ఒకేసారి దసరా పండుగ సందర్భంగా రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి అందులో ఒకటి చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్.. మరొకటి నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ సినిమాలు.


ఇక వీటితోపాటు బెల్లంకొండ సాయి నటిస్తున్న స్వాతి ముత్యం అనే చిన్న సినిమా కూడా విడుదల కాబోతున్నది. ఈ సినిమా పైన కూడా మంచి బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.. అయితే ఈ రెండు చిత్రాల పక్కన ఈ సినిమా నిలబడుతుందా అనే ప్రశ్న కూడా సినీ అభిమానులలో తలెత్తుతోంది. అయితే ఇప్పుడు తాజాగా మంచు విష్ణు నటిస్తున్న జిన్నా సినిమా కూడా అదే రోజున విడుదల కాబోతున్నది. ఇందులో మంచు విష్ణు హీరోగా.. పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం ఒక హారర్ కామెడీ కథాంశంతో ఈ సినిమా నీ తెరకెక్కించడం జరుగుతోంది.. టీజర్ ను కూడ ఇటీవల విడుదల చేయడం జరిగింది.


ఈ టీజర్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉండడంతో ఈ సినిమా పైన కూడా మంచి బజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. కామెడీ జోనర్లు మంచి విష్ణు నటించిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.. కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మంచు విష్ణు హిట్ కొడతాడా లేదా అనే విషయం మాత్రం చెప్పలేమని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే దసరాబారిలో మంచు విష్ణు జిన్నా సినిమా తో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. అయితే గాడ్ ఫాదర్,ఘోస్ట్ సినిమాలు మధ్య జిన్నా సినిమా నిలబడుతుందా అని ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: