మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ అయినటువంటి లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్యదేవ్ ,  నయనతార ముఖ్య పాత్రలలో నటించారు. తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. 

మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఇప్పటికే విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి 'తార్ మార్' అనే సాంగ్ ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అలాగే ఈ సాంగ్ ప్రోమో ని కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ తార్ మార్ అనే ఫుల్ లిరికల్ సాంగ్ ను చెప్పిన తేదీకి విడుదల చేయలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ తార్ మార్ ఫుల్ లిరికల్ సాంగ్ విడుదల తేదీని తాజాగా ప్రకటించింది. గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ తార్ మార్ సాంగ్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ లు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: