టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినా శ్రీ విష్ణు తాజాగా అల్లూరి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించ బోతున్నాడు. ఈ మూవీ కి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించాడు. ప్రదీప్ వర్మ ఈ మూవీ ని పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయమన్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను కూడా చాలా ఘనంగా నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడు కకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు అయినటు వంటి ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా విచ్చేశారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా హీరో శ్రీ విష్ణు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీ విష్ణు ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ ...  అల్లూరి మూవీ పోలీస్ అధికారి ఫిక్షనల్ బయోపిక్ గా ఉంటుంది. ఈ మూవీ కథ విన్నాక పోలీసు లపై మరియు ఈ వ్యవస్థ పై చాలా గౌరవం పెరిగింది. ఈ వ్యవస్థ లోని మంచి మరియు చెడులను మూవీ కోసం చర్చించాం. చెడుకు పరిష్కారం కూడా చూపిస్తాం అని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా శ్రీ విష్ణు చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: