తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా విడుదల కావడానికి రెడీ గా ఉన్న మూవీ పొన్నియన్ సెల్వన్. ఈ మూవీ కి భారత దేశంలోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి అందించిన పాటలలో నుండి కొన్ని పాటలను మూవీ యూనిట్ ఇప్పటికే విడుదల చేయక వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. అందులో మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది. 

మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ ,  మలయాళ ,  హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీ యూనిట్ ప్రస్తుతం తమిళనాడు లో అదిరి పోయే రేంజ్ లో ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ తెలుగు ప్రమోషన్ లను కూడా మరి కొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ 23 వ తేదీన సాయంత్రం 6 గంటలకు జే ఆర్ సి కన్వెన్షన్స్ , హైదరాబాద్ లో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: