మెగాస్టార్ చిరంజీవి ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో తనకెక్కిన ఆచార్య మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన ఆచార్య మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో ఆచార్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలయ్యింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనే మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్యదేవ్ ,  నయన తార కీలక పాత్రలలో నటించగా ,  మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ ని తెలుగు మరియు హిందీ భాషలలో అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు  ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రలో నటించడంతో ఈ మూవీ కి హిందీ లో కూడా మంచి క్రేజ్ లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్ల ట్రియేటికల్ బిజినెస్ ని జరుపుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ డిజిటల్ రైట్స్ 57 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. వాటితో పాటు సాటిలైట్ హక్కులు ,  ఆడియో హక్కులు 60 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా హక్కులు దాదాపు 207 కోట్ల బిజినెస్ ని జరుపుకున్నట్లు సమాచారం. ఇలా గాడ్ ఫాదర్ మూవీ కి అద్భుతమైన బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: