కోలీవుడ్ సూపర్ హిట్ మాధవన్, విజయ్ సేతుపతి నటించిన విక్రమ్ వేదా సినిమా ను హిందీలో హృతిక్ రోషన్ ఇంకా అలాగే సైఫ్ అలీ ఖాన్ లు అదే టైటిల్ తో రీమేక్ చేశారు. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన పుష్కర-గాయత్రి ఈ రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. ఇక ఈనెల 30వ తారీకున విడుదల కాబోతున్న విక్రమ్ వేద సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ప్రస్తుతానికి సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. సినిమా ట్రైలర్ విడుదల తర్వాత బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.ఈ సమయంలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ సినిమాను వణికిస్తుంది.


అదే ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యి నిరాశ పర్చాయి. జెర్సీ.. హిట్ తో పాటు మరి కొన్ని సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అంతకు ముందు అర్జున్ రెడ్డి రీమేక్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కానీ ఆ తర్వాత మాత్రం రీమేక్ లు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేక పోయాయి. అక్షయ్ కుమార్ వంటి సూపర్ స్టార్ చేసిన రీమేక్ కు కూడా ప్రేక్షకుల తిరష్కరణ తప్పలేదు. దీంతో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే అభిప్రాయం చాలా మంది లో వ్యక్తం అవుతోంది. అయితే బాలీవుడ్ వర్గాల వారు మాత్రం విక్రమ్ వేదా సినిమాపై చాలా నమ్మకంతో కనిపిస్తున్నారు. 


కారణం ఏంటంటే ఈ రీమేక్రీమేక్ ల లాగా కాదు అంటూ వారు అంటున్నారు.దేశావ్యాప్తంగా పిచ్చ క్రేజ్ వున్న హీరో హృతిక్ రోషన్ కాబట్టి ఆయన సినిమా రీమేక్ అయినా.. మరేదైనా ఖచ్చితంగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.హృతిక్ రోషన్ స్టార్ డమ్ ముందు బ్యాడ్ సెంటిమెంట్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. బ్రహ్మాస్త్ర సినిమా ఇచ్చిన జోష్ తో విక్రమ్ వేదాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.బ్రహ్మాస్త్ర సినిమా కు మిశ్రమ స్పందన వచ్చినా కూడా వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. అందువల్ల హృతిక్ రోషన్ తన స్టార్ ఇమేజ్ తో విక్రమ్ వేదా ని భారీ విజయం దిశగా తీసుకు వెళ్లే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: