క్రేజీ కాంబినేషన్ బాలకృష్ణ, అనిల్ రావిపూడి..

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎఫ్ 3 మూవీ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ బాలయ్యతో చేయబోతున్నట్టు చెప్పడమే కాదు. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను ఎఫ్ 3 మూవీ ప్రమోషన్‌లో భాగంగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే కదా.

బాలకృష్ణ విషయానికొస్తే.. అఖండ'తో భారీ సక్సెస్‌ను అందుకున్న బాలయ్య.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. అది కాకుండా.. బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా మెగా ఫ్యామిలీకి చెందిన 'ఆహా' ఓటీటీకి హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.

 
అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య వయసు పైబడిన తండ్రిగా మున్నెప్పుడూ కనిపించని లుక్‌లో అలరించబోతున్నారు. అలాగే ఆయన కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీలా కనిపించబోతోంది. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా తేలలేదు. తాజాాగా ఓ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది.

 
తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మరోసారి నయన్ బాలయ్యతో జతకట్టినట్లు అవుతుంది.

 
ఇప్పటికే బాలకృష్ణతో కలిసి నయనతార రెండు సినిమాల్లో నటించింది. జై సింహా, సింహా వంటి సూపర్ హిట్ చిత్రాలు ఇద్దరు కలిసి నటించారు. దీంతో మరోసారి బాలయ్యతో నయన్‌ జోడీ కడుతున్నారన్న వార్తలతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన 'అఖండ' సక్సెస్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా గుంటూరులోని రామకృష్ణ థియేటర్‌లో 175 పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా తర్వాత ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

ఇప్పటికే ఓ సారి బాలయ్యతో సినిమా చేయాలని చూసాడు అనిల్. నిజానికి ఆయన 100వ సినిమా కూడా అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలని చూసాడు నిర్మాత దిల్ రాజు. అప్పట్లో ఈ కాంబినేషన్‌లో రామారావు గారు అనే సినిమా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది.

ఇందులో బాలయ్య 50 ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. మూడోది.. సెప్టెంబర్ నుంచే ఇది సెట్స్ మీదకి వెళ్తుందని చెప్పారు. మరోవైపు హీరో రాజశేఖర్.. విలన్ పాత్ర కోసం అనుకుంటున్నారు. బాలయ్య క్యారెక్టరైజేషన్ చాలా స్పెషల్‌గా ఉంటుందని, ఇందులో ఫ్యాన్ మూమెంట్స్ కూడా చాలా ఉంటాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: